యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun), మాల్వి మల్హోత్రా(Malvi Malhotra) జంటగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘తిరగబడర సామీ’(Tiragabadara Saami). ఈ మూవీ ఆగస్టు 2న థియేటర్లలలో ప్రేక్షకుల ముందుకు రిలీజై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ త్వరలో వస్తుందంటూ ఇటీవలే ఆహా వెల్లడించింది.
తాజగా తిరగబడర సామీ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రముఖ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో గురువారం సెప్టెంబర్ 19వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. 'ప్రేమ మరియు జీవితం కోసం యువ జంట పోరాటం!' అని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
తిరగబడర సామీ సినిమాకు మేకర్స్ చేసిన ప్రమోషన్స్ కంటే వ్యక్తిగత విషయాల ద్వారా మొదలైన వివాదాలే ప్రమోషన్స్ చేసిపెట్టాయి. ముందుగా ఈ సినిమా డైరెక్టర్, హీరోయిన్ మన్నారా చోప్రాకి ముద్దు ఇవ్వడం. ఆ తరువాత హీరో హీరోయిన్ల మీద హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు యుద్దానికి దిగడం లాంటివి సినిమాకి మంచి ప్రమోషన్ చేసి పెట్టాయి. అలా ఈ వివాదం మధ్యలోనే థియేటర్లలోకి వచ్చిన ‘తిరగబడరా సామీ’ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
కథేంటంటే:
గిరి (రాజ్ తరుణ్) చిన్న వయస్సులోనే అమ్మ నాన్నలను నుంచి తప్పి పోయి ఓ అనాథలా పెరుగుతాడు. ఎవరూ లేక అనాథలా ఉన్న గిరిని చిన్నతనంలో ఆటో జానీ (బిత్తిరి సత్తి) చేరదీస్తాడు. అమాయకత్వం, భయం రెండు గిరికి ఎక్కువే. గొడవలకు దూరంగా సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటాడు. తనలా తప్పిపోయిన వారిని కనిపెట్టి వారి వారి కుటుంబానికి దగ్గర చేయడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుంటాడు. అలా అతని పేరు అందరికీ తెలిసిపోతుంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో గిరిని చూసిన శైలజ (మాల్వి మల్హోత్రా) అతనికి క్లోజ్ అవుతుంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లితో ఒక్కటవుతారు. ఇక అదే కాలనీలో ఉండే మటన్ మస్తాన్(రాజా రవీంద్ర), తులసమ్మ (ప్రగతి) సహా చుట్టూరా ఉండే ప్రతిఒక్కరు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు.
అదే సమయంలో తన భార్య శైలజ కోసం కొండారెడ్డి (మకరంద్ దేశ్‌పాండే) ముఠా తన ఆచూకీ కోసం తిరుగుతుంటారు. ఈ క్రమంలో కొండారెడ్డి గ్యాంగ్ గిరి గురించి తెలుసుకుని అతన్ని కూడా పిలిపించి శైలజని వెతికి పెట్టాలని లేదంటే ప్రాణాలతో ఉండవని బెదిరించి కొడతారు. తన భార్య శైలజ రూ.2 వేల కోట్ల ఆస్తికి వారసురాలని తెలిశాక గిరి ఏం చేశాడు? శైలజ వచ్చాక గిరి జీవితంలో వచ్చిన మార్పులేంటి? ఇంతకీ శైలజకీ, కొండారెడ్డికీ మధ్య ఉన్న సంబంధమేమిటి? కొండారెడ్డితో గొడవల కారణంగా గిరికి ఆప్తులైన ఆటోజానీ (బిత్తిరి సత్తి), మస్తాన్ (రాజా రవీంద్ర), తులసమ్మ (ప్రగతి) ఎలాంటి కష్టాలు పడ్డారు? తదితర విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.