Raj Tarun: రాజ్‌తరుణ్‌ కొత్త మూవీ బిజినెస్ లాస్‌ అయిందా?..పరిస్థితి ఎలా ఉందో చెప్పిన నిర్మాత

టాలీవుడ్ యువ న‌టుడు రాజ్ త‌రుణ్ (Raj Tarun) ఈమధ్య తన సినిమాల కంటే..ఆయన పేరే ఎక్కువ మోగుతుంది. ఒకవైపు మాజీ ప్రేయసి లావ‌ణ్య వివాదం న‌డుస్తుంటే..మ‌రోవైపు త‌న సినిమాల‌ను వరుసబెట్టి పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన పురుషోత్తముడు (Purushottamudu) మూవీ జూలై 26న థియేటర్స్ లోకి రాబోతోంది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ చూస్తుంటే శ్రీమంతుడు, మహర్షి మూవీస్ మాదిరిగా ఉన్నట్లు ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. 

Also Read:-సినీ నటులపై అసభ్యకర పోస్టులు..ఆ 18 యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్

మంగళవారం జూలై 23న ఈ సినిమా మేకర్స్ పురుషోత్తముడు ప్రీ రిలీజ్ ఈవెంట్  నిర్వహించారు. ఇందులో హీరో రాజ్ తరుణ్ పాల్గొనలేదు. దీనిపై మీడియా ప్రతినిధులు దర్శక, నిర్మాతలని రాజ్ తరుణ్ గురించి ప్రశ్నించారు.'హీరో రాజ్‌తరుణ్‌ వల్ల సినిమా బిజినెస్ లాస్‌ అయిందా?అనే ప్రశ్నకు నిర్మాత రమేశ్‌ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. 

‘తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పగా,విభిన్నంగా ఆలోచిస్తారు. మూవీ కంటెంట్ ని, అందులో నటించిన యాక్టర్స్ పాత్రలని మాత్రమే చూసి సినిమాని సక్సెస్ చేస్తారు. ఒక సినిమా వెనక 2వేల మంది కార్మికుల కష్టం ఉంటుందని ఆడియన్స్‌కు కూడా తెలుసు. మూవీ బిజినెస్‌, రిసల్ట్ విషయాల్లో మేము ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. అది పూర్తిగా మేం తెరకెక్కించిన క్వాలిటీపై, సినిమాలో ఉన్న కంటెంట్ పై  ఆధారపడి ఉంటుంది.

అయితే, ప్రస్తుతం రాజ్‌తరుణ్‌ తన వ్యక్తిగత విషయాల కారణంగా బిజీగా ఉండటంతో ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. అలాగే మేం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే యూట్యూబ్‌లోనూ ‘పురుషోత్తముడు’ టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్ కి మిలియన్స్‌లో వ్యూస్‌ వచ్చాయి. ఇది అంత కంటెంట్ తో కూడిన క్వాలిటీ ఉన్న సినిమా. అందుకే మన తెలుగు ప్రేక్షకులు దీన్ని కచ్చితంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. 

రామ్‌‌‌‌ భీమన దర్శకత్వంలో శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్‌‌‌‌, ప్రకాష్‌‌‌‌ తెజావత్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజ్‌‌‌‌ తరుణ్‌‌‌‌ కి జోడిగా హాసిని సుధీర్‌‌‌‌ నటిస్తుంది. రిలీజ్ చేసిన పురోషత్తముడు ట్రైలర్ ఫీల్ అండ్ ఫ్రెష్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ గా ఉంది. 'ఒకయుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడు అయ్యాడు.. అలాగే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహల్లాదుడు మహనీయుడు అయ్యాడు..మాట కాదు ధర్మం అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ఈ మూవీకి ఫీల్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్‌ స్వరాలూ సమకూరుస్తుండగా..మురళీశర్మ, కౌసల్య, ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమంతుడు మూవీ లాంటి కంటెంట్ తో ఉంటుందనే టాక్ రావడం ఇది ఓ విధంగా సినిమాకి పాజిటివిటీ పెంచేది అని చెప్పాలి.మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి అనుభూతిని ఇవ్వనుందో చూడాలి.