హైదరాబాద్: లావణ్య, రాజ్ తరుణ్ కేసులో గట్టిగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. ఈ మస్తాన్ సాయి కేసులో తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతను పలువురు యువతులను శారీరకంగా వాడుకుని, రహస్యంగా వీడియోలు రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని లావణ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆరోపణలు మాత్రమే కాదు ఆధారాలతో సహా 200 వీడియోలతో కూడిన మస్తాన్‌సాయికి చెందిన హార్డ్ డిస్క్ను పోలీసులకు అందజేసింది. దీంతో.. మస్తాన్ సాయి ఎంత కీచకుడో తేలిపోయింది.
బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే మరోసారి బ్లాక్ మెయిల్ చేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫ్యాన్కి ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్స్ చేశాడు. ఒక్కొక్కరుగా మస్తాన్ సాయి బారిన పడిన బాధిత మహిళలు ముందుకొస్తున్నారు. వంద మందికి పైగా మహిళలను ట్రాప్ చేసి అనుభవించి మస్తాన్ సాయి వీడియోలు రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసి పైశాచిక ఆనందం పొందాడు. యువతులను బూతులు తిడుతూ మానసిక క్షోభకి గురిచేశాడు.
రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి అనే వ్యక్తి కారణమని నార్సింగి పోలీసులకు లావణ్య తాజాగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 200 వీడియోలతో కూడిన మస్తాన్‌సాయికి చెందిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది. అతను పలువురు యువతులను శారీరకంగా వాడుకుని, రహస్యంగా వీడియోలు రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. తనకు సంబంధించిన పర్సనల్వీడియోలు హార్డ్‌డిస్క్‌లో ఉన్నాయని తెలిపింది. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి, మస్తాన్‌సాయిని కోకాపేటలో అరెస్ట్‌చేశారు.
Also Read :- షారూఖ్, సల్మాన్ కుంభమేళాకు వెళ్లారా ?
పీఎస్వద్ద లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. పూర్తి వివరాలను తాను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పింది. కాగా, నార్సింగి మంత్రి యుఫోరియా ప్రాంతంలో ఉండే మస్తాన్ సాయి(33), లావణ్య స్నేహితులు. అతను వివాహితలతో పాటు యువతులను డ్రగ్స్కు బానిసలుగా మార్చి, వారితో శారీరకంగా కలిసినప్పుడు వీడియోలు తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడని లావణ్య ఆరోపించింది.
జనవరి 31న మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి అతని 4 టీబీ హార్డ్ డిస్క్ను అతనికి తెలియకుండా లావణ్య తీసుకుంది. అందులో 200 పర్సనల్వీడియోలు ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. హార్డ్ డిస్క్ కోసం కొన్నాళ్లుగా తనను బెదిరిస్తున్నాడని, కత్తితో గొంతుకోసే ప్రయత్నం చేశాడని పేర్కొంది. బాధితురాలిపై మస్తాన్‌సాయి అటాక్చేయడానికి వచ్చినప్పటి సీసీ పుటేజీని పోలీసులు సేకరించారు. ఫిబ్రవరి 2న లావణ్య ఇంటికి వెళ్లిన మస్తాన్‌సాయి అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశాడని గుర్తించారు.