మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలవ లేదు. కానీ ఆపార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే మాత్రం రోజూ వార్తల్లో ఉంటూనే ఉన్నారు. గతంతో పోల్చితే2019లో సరికొత్త అవతారమెత్తారు. ఒక విధంగాచెప్పాలంటే బీజేపీ హైకమాండ్కి కొరకరాని కొయ్యల్లో ఒకడిగా తయారయ్యారు.శివసేన ఫౌండర్ బాల్ ఠాక్రే బంధువు రాజ్ ఠాక్రే ప్రస్తుతం అనుసరిస్తున్న రాజకీయవిధానం ప్రధాని మోడీ ఇమేజీని బాగానే డ్యామేజ్ చేస్తోందనిరాజకీయ విశ్లేషకులుఅంటున్నారు.
పెదనాన్న బాల్‌ఠాక్రే మాదిరిగానే, ఆయనచూపిన బాటలోనే రాజ్ ఠాక్రే సందర్భం చిక్కినప్పుడల్లా దేశభక్తిని, (మహా)రాష్ట్ర భక్తిని గడుసుగా చాటుకోడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. 2016లోబాలీవుడ్ ఆల్‌రౌండర్ కరణ్ జోహార్.. ‘యే దిల్ హై ముష్కిల్’ అనే రొమాంటి క్ డ్రామా ఫిల్మ్‌లో పాకిస్థాన్ యాక్టర్ ఫవద్ ఖాన్ కి ఛాన్స్ ఇచ్చారు. దాయాది దేశానికి చెందిన నటుడికి ఇండియన్ సినిమాలోఅవకాశం ఇవ్వటం రాజ్ ఠాక్రేకి అస్సలు నచ్చలేదు. దీంతో కరణ్ జోహార్ దిగొచ్చి క్షమాపణ చెప్పేదాకవదల్లేదు.
మూడేళ్ల కిందట జరిగిన ఈ వ్యవహారం రాజ్ ఠాక్రేలోని జాతీయ భావాన్ని బలంగా వ్యక్తం చేయగా ఆయనలోని ప్రాంతీయ అభిమానాన్ని పట్టిచూపిన పరిణామం తొమ్మిదేళ్ల క్రితం చోటుచేసుకుంది. 2010లో టెలికం సంస్థలు తమ సేవలను ఇంగ్లిష్ ,హిందీ తోపాటు మహారాష్ట్ర అధికారిక భాష మరాఠీలోనూ అందించేలా రాజ్ ఠాక్రే ఒత్తిడి తెచ్చి విజయంసాధించారు. ఆ కంపెనీల కార్యకలాపాలు తమరాష్ట్రం లో కొనసాగాలంటే ఈ కండిషన్ కి ఒప్పుకొని తీరాల్సిందేనంటూ ఒకానొక దశలో భీష్మించుకొని కూర్చున్నారు.
తన ప్రాంతంపై ఆయనకు ఉన్న ‘పట్టు’దలకు ఇది ఒకఉదాహరణ మాత్రమే. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి.అయితే వాటిలో కొన్ని అదుపుతప్పిన సందర్భాలూలేకపోలేదు. 2008లో రాజ్ ఠాక్రే పార్టీ (మహారాష్ట్రనవ నిర్మాణ సేన–ఎంఎన్ ఎస్ ) అప్పుడప్పుడే అన్ని ఏరి-యాల్లోనూ వేళ్లూ నుకుంటోం ది. ఆ సమయంలోనార్త్ ఇండియా నుం చి మహారాష్ట్ర లోకి వలసవచ్చిన ట్యాక్ సీ డ్రైవర్లపై ఎంఎన్ ఎస్ కార్యకర్తలుదాడులకు పాల్పడ్డారు. రైల్వే ఎగ్జా మ్స్ రాయటా-నికి వచ్చిన స్టూ డెంట్స్ని చితకబాదారు.ప్రాంతాలు వేరైనా అందరిదీ ఒకే దేశం (ఇండియా)అనే విషయం మరిచారు. జయా బచ్చన్ ఓసారి ఒకపబ్లిక్ మీటింగ్‌లో హిందీ లో మాట్లాడితే ఎంఎన్ ఎస్వాళ్లు నానా రాద్ధ ాంతం చేశారు. దీంతో ఆమె భర్త,బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘సారీ’ చెప్పి సమస్యను పరి-ష్కరిం చారు. సైన్ బోర్డులపై పేర్లు ఇంగ్లిష్ తోపాటుమరాఠీలోనూ ఉండాల్సిం దే అంటూ షాపుల యజ-మానులను రాజ్ ఠాక్రే అనుచరులు బెదిరిం చారు.కొన్నిసార్లు ఇలా అతిగా ప్రవర్తిం చటం ఎంఎన్ ఎస్ కిచెడ్డ పేరు తెచ్చిం ది.
జోష్ నింపుతున్న రాజ్ ప్రసంగాలు
పదునైన మాటలతో ప్రత్యర్థి పార్టీలను ఎండగడుతూప్రజలను ఆకట్టుకోవటంలో రాజ్ ఠాక్రే.. బాల్ఠాక్రేనుగుర్తు చేస్తున్నారు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకు-నే పేరుగొప్ప పనులను తెలివిగా తిప్పికొ డుతున్నారు.డిజిటైజేషన్ నుం చి డీమానిటైజేషన్ వరకు పాలకులహామీలు ఏ మేరకు నీరు గారాయో వీడియో ఫుటేజ్లు చూపుతూ ఎఫెక్టివ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీకిఓటేయాలా వద్దా అనే ఆలోచనను స్థానికుల్లో కలగ-జేస్తున్నారు. తనదైన శైలిలో రెచ్చగొట్టే ప్రసంగాలతోసాధారణ జనాన్ని , పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. కాంగ్రెస్ , ఎన్సీపీ వంటి పార్టీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిం చలేకపోతుండటంతో ఆ లోటును రాజ్ఠాక్రే భర్తీ చేస్తున్నారు. మోడీ, అమిత్ షా లను నంబర్వన్ గా విమర్శించగలుతున్నారు. ప్రధాని, బీజేపీ చీఫ్ ఇద్దరూ అబద్ధాల కోరుల్లా తయారై ప్రజలను మోసగిస్తున్నారని మండిపడుతున్నారు. పెదనాన్న కొడుకైన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన బీజేపీతో చేతులు కలపటాన్ని తప్పుపడుతున్నారు.
అచ్చం పెద్దాయనే
పంచ్ లతో కూడిన స్పీచ్ లు, డైరెక్ట్ ఎటాక్ చేసే టాకింగ్ పవర్ లోనే కాదు. కార్టూన్లు గీయటంలో,హెయిర్ స్టైల్లో, బీరుని ఇష్టంగా తాగటంలో ఇలా ప్రతిదానిలోనూ రాజ్ ఠాక్రే.. బాల్ ఠాక్రేను తలపిస్తున్నారు. ప్యాషన్ తో పాటు బాడీ లాంగ్వేజ్ పరంగా అచ్చం పెద్దాయన వారసత్వాన్నే పుణికి పుచ్చుకున్నారు. కానీ.. ఆయన స్థాపించిన శివసేన పార్టీకి ప్రెసిడెంట్అయ్యే అదృష్టాన్ని మాత్రం పొందలేకపోయారు. ఈవిషయం ఆయనకు 2006లోనే అర్థమైంది. అందుకే సొంతగా ఎంఎన్ఎస్ ని స్థాపించారు.
ఆ పార్టీ ఓటమే లక్ష్యం
అనుకున్నది సాధించటానికి, నమ్మింది పాటించటానికి రాజ్ ఠాక్రే ఎంత వరకైనా వెళతారు. షారూఖ్ఖాన్ నుంచి షాప్ కీపర్ వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు. ఎంఎన్ ఎస్ ను ప్రారంభించింది మొదలునేటి దాక వెనుదిరిగి చూడలేదు. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా మహారాష్ట్ర ప్రజలప్రయోజనాల కోసమే తపిస్తు న్నారు. ఈ క్రమంలోనే పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈజనరల్ ఎలక్షన్ లో బీజేపీకి మళ్లీ అధికారం దక్కకుండా చేయాలన్నదే ఆయన ప్రస్తు త లక్ష్యం. అదిఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.