Thiragabadara Swamy Trailer: తిరగబడర సామీ ట్రైలర్ రిలీజ్..రొమాన్స్‌‌తో పాటు హై వోల్టేజ్ యాక్షన్

Thiragabadara Swamy Trailer: తిరగబడర సామీ ట్రైలర్ రిలీజ్..రొమాన్స్‌‌తో పాటు హై వోల్టేజ్ యాక్షన్

యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tharun), మాల్వీ మల్హోత్రా(Malvi Malhotra) జంటగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి(AS Ravikumar Chaudary) దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్  నిర్మించిన చిత్రం ‘తిరగబడర సామీ(Thiragabadara Swamy)’. మన్నారా చోప్రా కీలక పాత్రలో కనిపిస్తుంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్ మరియు టీజర్‌కి ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. 

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. రాజ్ తరుణ్ ఇప్పటివరకు నటించిన సినిమాలను బట్టి చూస్తే ఇంతటి హెవీ యాక్షన్ చేయలేదు.ఈ మూవీతో అతనిలో నుంచి డైరెక్టర్  ఎ.ఎస్.రవికుమార్ చౌదరి కొత్త యాక్షన్ అవతారాన్ని ప్రేక్షకులకు చూపెడుతున్నట్లు తెలుస్తోంది. యూత్‌‌ను ఆకట్టుకునే రొమాన్స్‌‌తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్,మాస్‌‌ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్,ఎమోషనల్ ఎలిమెంట్స్‌‌తో ట్రైలర్ ఆసక్తిగా ఉంది. 

ఇక ఈ సినిమా సాగ భాగం వరకు ఒక అమాయక కుర్రాడిలా రాజ్ తరుణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తనకు ఎదురైన సమస్యల వల్ల ఎలా వైలెన్స్ దారిలోకి వెళ్తాడు అనే అంశం చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ బట్టి అర్ధమవుతుంది. విలన్ గా మకరంద్ దేశ్‌‌‌‌పాండే నటిస్తుండగా..రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భాష్యశ్రీ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తుండగా, జేబీ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది.