
హన్సిక హీరోయిన్‌గా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌లో ‘105 మినిట్స్’ అనే ప్రయోగాత్మక చిత్రాన్ని తీసిన దర్శకుడు రాజా దుస్సా.. బుధవారం తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. తెలంగాణ యాస, భాష నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రానికి ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నిర్మాత అనిల్ సుంకర టైటిల్‌ను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు.
ఎయిటీస్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్ జిల్లాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు రాజా దుస్సా తెలియజేశారు. శ్రీరామకృష్ణ సినిమా బ్యానర్‌పై గాలి కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాంపల్లి సోమాచారి, అలూరి రాజిరెడ్డి , రూప కిరణ్ గంజి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.