ప్రభాస్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. మే నుంచి ‘రాజా సాబ్‌‌’ సందడి స్టార్

ప్రభాస్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. మే నుంచి ‘రాజా సాబ్‌‌’ సందడి స్టార్

ప్రభాస్‌‌ హీరోగా నటిస్తున్న వరుస పాన్‌‌ ఇండియా సినిమాల్లో ‘రాజా సాబ్‌‌’ కూడా ఒకటి.  మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.  ప్రభాస్‌‌ కెరీర్‌‌‌‌లో ఫస్ట్ టైమ్ హారర్ జానర్‌‌‌‌ మూవీలో నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. దీంతో మూవీ అప్‌‌డేట్స్‌‌ కోసం ఈగర్‌‌‌‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మే నెల నుంచి ప్రమోషన్స్‌‌ స్టార్ట్ చేయబోతున్నట్టు దర్శకుడు మారుతి హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలోని ప్రభాస్‌‌ లుక్‌‌ను ఓ అభిమాని ఆటో వెనుక అతికించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో ట్యాగ్‌‌ చేస్తూ.. హై అలర్ట్‌‌.. మే నుంచి వేడి సెగలు మరింత ఉదృతం అవబోతున్నాయి అని  పోస్ట్ చేశాడు. 

దీన్ని బట్టి మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌‌లో ఈ మూవీ నుంచి టీజర్‌‌‌‌ రాబోతున్నట్టు అర్థమవుతోంది.  ఇప్పటికే వింటేజ్‌‌ లుక్‌‌లో ప్రభాస్‌‌ను ప్రజెంట్‌‌ చేస్తూ వచ్చిన పోస్టర్స్‌‌ ఆకట్టుకోగా, టీజర్‌‌‌‌ విషయంలోనూ మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా వీఎఫ్‌‌ఎక్స్‌‌ విషయంలో రాజీ పడకుండా క్వాలిటీ అవుట్‌‌పుట్‌‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక టీజర్‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌ డేట్‌‌పై కూడా  క్లారిటీ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.  నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌‌దత్‌‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.  టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.