
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. అంతేకాదు ఈ ఎన్నికలలో విజయం సాధించాలంటే అధికారాన్ని దక్కించుకోవాలంటే దేవుళ్ళు దయ కూడా కావాలని భావిస్తూ యజ్ఞయాగాలు సైతం చేస్తున్నారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాటలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి ( ఫిబ్రవరి 16 )నుంచి మూడు రోజులపాటు పాటు చంద్రబాబు దంపతులు రాజశ్యామల శ్యామల యాగాన్ని చేయనున్నారు. మొదటి రోజు( ఫిబ్రవరి 16 )న జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు.
రాజకీయ నాయకులు యాగం చేయడం సాధారణ విషయంగా మారిపోయింది. సీఎం పదవి కోసం చేస్తారో.. అధికారం కోసం చేస్తారో తెలియదు కానీ యాగం మాత్రం చేసేస్తారు. కేసీఆర్ గతంలో అనేకసార్లు చేశారు.. గత ఎన్నికలకు ముందు కూడా చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అటు రేవంత్‌రెడ్డి కూడా చేశారు. ఆయన గెలిచారు. ఇటు ఏపీలోనూ చంద్రబాబు యాగాలు చేస్తున్నారు.
చంద్రబాబు దంపతులు మరోసారి రాజశ్యామల యాగం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు దంపతులు మూడు రోజులపాటు ( ఫిబ్రవరి 16,17,18) రాజశ్యామల యాగం చేస్తున్నారు. రాజశ్యామల యాగంలో చంద్రబాబు,భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. ఉదయం 9 నుంచి 12:00 వరకు, తిరిగి సాయంత్రం 6:00 నుంచి 9:00 వరకుఈ యాగం కొనసాగుతుంది. వ్యక్తిగత దోష నివారణ కోసం రాజ్యశ్యామల యాగం చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జనవరిలో చండీ యాగం చేసిన చంద్రబాబు ఇప్పుడు రాజశ్యామల యాగం చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు ఈ యాగం చేశారు.
50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. ఈ రాజ శ్యామల యాగాన్ని విజయాన్ని అందుకోవాలని, శత్రువులు క్షీణించాలని, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని నిర్వహిస్తారు. విజయం సిద్ధించేలా చేయమని శ్యామలాదేవిని అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి యాగాన్ని నిర్వహిస్తారు .
రాజశ్యామల యాగాన్ని ఎన్నికలకు ముందు చేయడం ముఖ్యంగా ప్రత్యర్థులను బలహీనం చేయడానికేనని ఈ యాగం గురించి తెలిసిన పండితులు చెబుతున్నారు. ఏపీలో వైయస్ జగన్ , చంద్రబాబు మధ్య హోరాహోరీగా ప్రచ్చన్న సమరం కొనసాగుతున్న వేళ జగన్ ను గద్దె దించాలని దృఢ సంకల్పంతో ఉన్న చంద్రబాబు ఈ క్రమంలోనే రాజ శ్యామల యాగం చేయడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
రాజశ్యామలా యాగం ప్రయోజనాలు
- ప్రభుత్వ సంబంధిత సమస్యలు లేదా అడ్డంకులను అధిగమించడానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తి కుటుంబాన్ని కష్టాలు, డబ్బు సంబంధిత బాధల నుంచి ఆశీర్వదిస్తుంది. రక్షిస్తుంది. తద్వారా జీవితంలో అధిక అదృష్టాన్ని ఇస్తుంది.
- ఇది ఒక వ్యక్తికి జ్ఞానంలో ప్రావీణ్యం పొందడానికి సహాయపడుతుంది.
- దేవత రాజా శ్యామలా దేవి... బ్రహ్మ, సరస్వతీ దేవికి ఉన్న ఏకైక కుమార్తె. ..నారద మహర్షి చెల్లెలు. ..ఆమె ఫేట్ రైటర్, సృష్టికర్త అయిన బ్రహ్మకు సహాయం చేస్తుంది. రాజా శ్యామల దేవత వాక్కు, సంగీతం, జ్ఞానం, కళలను నియంత్రిస్తుంది. అతీంద్రియ శక్తులను పొందడం, ముఖ్యంగా శత్రువులపై నియంత్రణ సాధించడం, ప్రజలను తనవైపు ఆకర్షించడం, కళలపై పట్టు సాధించడం, అత్యున్నత జ్ఞానాన్ని పొందడం కోసం ఆమె ఆరాధన నిర్దేశించబడింది.