రాజాసింగ్ నహీ హై!

రాజాసింగ్ నహీ హై!

 

  • గోషామహల్ లో విజయ సంకల్పయాత్ర

  •  హాజరైన స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

  •  సభలో కనిపించని సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో ఐదు విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ గోషామహల్ పరిధిలోని జుమ్మెరాత్ బజార్ లో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి నేతృత్వంలోని విజయసంకల్ప యాత్ర చేరుకుంది. ఈ వేదికపై సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కనిపించలేదు. హైదరాబాద్ సీటునూ గెలుస్తామని కమల నాథులు ధీమాగా ప్రకటిస్తున్న ఈ తరుణంలో రాజాసింగ్ యాత్రలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.