నాల్గో రౌండ్ ఫలితాలపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నాల్గో రౌండ్ లో బీజేపీకి తక్కువ ఓట్లు రావడంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలంలో బీజేపీకి ఆధిక్యం వస్తుందని భావించామని..అయితే..ఈ మండలంలో టీఆర్ఎస్ లో అధిక ఓట్లు రావడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాల్గో రౌండ్ ఓట్లను మరోసారి లెక్కించాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో నాల్గో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ ముందంజలో ఉంది. నాలుగో రౌండ్ పూర్తి అయ్యేసరికి టిఆర్ఎస్ 714 ఓట్ల మెజార్టీలో కొనసాగుతోంది. నాల్గో రౌండ్ వరకు టిఆర్ఎస్ కు 26443 ఓట్లు పడగా బీజేపీకి 25729 ఓట్లు, కాంగ్రెస్ కు 7380, ఇతరులకు ఐదు వేలకు పైగా ఓట్లు పడ్డాయి.