యాదాద్రి భువనగిరి: తనకు హోంమంత్రి పదవి వస్తే బీఆర్ఎస్ మొత్తాన్ని జైల్లో పెడతానన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఏప్రిల్ 25వ తేదీ గురువారం లోక్ సభ ఎన్నికలలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనుకున్నాడని.. కాని, కేసీఆరే ఖతమయ్యాడని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రోజు తన ఇంటిముందుకు వస్తున్నారని చెప్పారు.తాను కప్పకపోయినా వాళ్ళే కప్పుకునేలా ఉన్నారన్నారు. అధికారం అడ్డం పెట్టుకొని మూడు ఫీట్ల జగదీశ్ రెడ్డి సంపాదించిన సొమ్ము ను కక్కిస్తానని చెప్పారు. ఎన్నికల ముందు చెప్పినట్టుగా కవిత అరెస్టు అయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వమ్యాన్ని కేసీఆర్ ఖుని చేశారని ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.