కేసీఆర్  డైరెక్షన్ లోనే   దాడులు : రాజగోపాల్ రెడ్డి

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై జరిగిన దాడిని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఖండించారు.  సీఎం కేసీఆర్  డైరెక్షన్ లోనే  మునుగోడులో టీఆర్ఎస్ శ్రేణులు ఈ దాడులు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే నాలుగుసార్లు దాడికి యత్నించారని, ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఇలా దాడులు చేయిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి ఈ దాడి చేయంచాడన్న ఆయన... టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదన్నారు. భయపడకుండా ధర్మం వైపు నిలబడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. 

కేసీఆర్  డైరెక్షన్ లోనే   దాడులు జరిగాయని మునుగోడు  బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం కావడం వల్లే ఈ దాడులు చేయిస్తున్నారన్నారు.  టీఆర్ఎస్ ఏం చేసినా మునుగోడులో ఆ పార్టీ గెలవదన్నారు.  పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై జరిగిన దాడిలో గాయపడ్డవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.