కాళేశ్వరం కేసులో హరీశ్రావు జైలుకెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రా జగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ కోసం హరీశ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, జైలుకు వెళ్లిన తరువాత రాజీనామా చేసినా ఒక్కటే చేయకపోయినా ఒక్కటేనని అన్నారు. పది ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, కోర్టు ద్వారా దేశంలోనే ప్రతి ష్టాత్మక తీర్పు రాబోతుందన్నారు. ఆరు నెలల్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు జైలుకు పోవడం ఖాయమని, కోర్టు ద్వారానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దవుతాయని చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత బీజేపీలోకి హరీశ్ పోతాడన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ శకం ముగిసిపోతుందన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ మిగులుతారన్నారు. కవిత తిహార్ జైలుకు పోయినా ఏం మొఖం పెట్టుకుని బస్సు యాత్ర పేరుతో కేసీఆర్ తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడికి భువనగిరి టికెట్ ఇచ్చి తనకు అగ్ని పరీక్ష పెట్టాడన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి, 2026 లో డీ లిమిటేషన్ లో నియోజక వర్గాన్ని చేస్తామని ప్రకటించారు.