చేర్యాల, వెలుగు: చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా మార్చడంతో పాటు మళ్లీ నియోజకవర్గం చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ భువనగిరి కో ఆర్డినేటర్ కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి టెంపుల్లో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డితో కలిసి పూజలు చేశారు. తర్వాత చేర్యాలలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్యేల సభ్యత్వాలు కోర్టు ఆదేశానుసారం రద్దు కాబోతున్నాయని, ఇలాంటి కేసు దేశంలోనే మొదటిది కాబోతుందన్నారు. హరీశ్‌రావు రాజీనామా చేయా ల్సిన అవసరం లేదని, కాళేశ్వరం కేసులో జైలుకు పోతాడని, అప్పుడు రాజీనామా చేసినా చేయకపో యినా ఒక్కటేనన్నారు.
తపాస్‌పల్లి నీళ్లను గజ్వేల్, సిద్దిపేటకు తరలించుకుపోయిన కేసీఆర్‌ను చేర్యాల ప్రజలు నమ్మరన్నారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపించిన 10 రోజుల్లోనే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ నియోజకవర్గంలో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలిచాడని, దీనిని బహిరంగంగా నిరూపిస్తే మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. చేర్యాల అంబేద్కర్ సెంటర్లో చర్చకు సిద్ధమన్నారు.
మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, కౌన్సిలర్లు నరేందర్, లింగం, ఇన్నమ్మ భాస్కర్‌రెడ్డి, తారా యాదగిరి, పట్టణ అధ్యక్షుడు చిరంజీవులు, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, శ్రీనివాస్, టెంపుల్కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.