నిజమేనా ఇది : కాంగ్రెస్లోకి రాజగోపాల్ అంటూ ప్రచారం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారా.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియాతోపాటు కొన్ని ఛానెల్స్ తో ప్రచారం జరగటం కలకలం రేపుతుంది. ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీజేపీలో యాక్టివ్ గా లేని రాజగోపాల్.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. బీజేపీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన ఖండించలేదు. దీంతో ఇది నిజమేనా అనే మాటలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ 24న రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.  మునుగోడు కాంగ్రస్ అభ్యర్థిగా  రాజగోపాల్ పోటీ చేస్తారని.. ఇదే విషయంపై తన అనుచరులు,ముఖ్య కార్యకర్తలతో చర్చిస్తున్నట్లు సమాచారం. 

Also Read :- బీఆర్ఎస్ వైపే మొగ్గు.. మిషన్ చాణక్య సర్వే

 పార్టీ మార్పుపై  ఓ మీడియాతో  మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఇంకా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీచేయాలని   మునుగోడు ప్రజలు తనపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.  ఉప ఎన్నికకు ఇప్పటికీ పరిస్థితులు మారాయన్నారు. మరో వైపు బీజేపీ ప్రకటించిన 52 మంది తొలి జాబితాలో రాజగోపాల్  పేరు లేదు.  దీంతో రాజగోపాల్ పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. 

మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.