రాజమండ్రి హేవ్ లాక్ బ్రిడ్జికి 124ఏళ్ళు: ఎంత ఖర్చుతో నిర్మించారో తెలుసా...

రాజమండ్రి హేవ్ లాక్ బ్రిడ్జి 124ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇది రాజమండ్రి కొవ్వూరు మధ్య మొట్టమొదటి బ్రిడ్జి. 1897లో శంకుస్థాపన జరిగిన ఈ బ్రిడ్జిని 1900లో ఆగస్టు 6న అప్పటి మద్రాసు గవర్నర్ హేవ్ లాక్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జిపై హౌరా మెయిలు రైలు తొలిసారి ప్రయాణించింది.9వేల 96అడుగుల పొడవు ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 46లక్షల 89వేల 849రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ బ్రిడ్జి మొత్తానికి 54స్తంబాలు ఉన్నాయి.

ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం 50లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేయగా.. అంచనా వ్యయానికంటే తక్కువ ఖర్చుకే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వటం గమనార్హం. కేవలం మూడేళ్ళలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వటం విశేషం. ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నప్పటికీ అనుకున్న సమయానికి బ్రిడ్జిలు పూర్తవ్వక అంచనా వ్యయానికంటే ఖర్చు కూడా రెట్టింపవుతున్న క్రమంలో ఇప్పటి తరానికి హేవ్ లాక్ బ్రిడ్జి ఒక కేస్ స్టడీ, అప్పటి తరానికి ఒక అపురూప జ్ఞాపకం.

Also Read:-విజయవాడ దుర్గ గుడి మెట్లను శుద్ధి చేసిన పవన్ కళ్యాణ్