
- వరంగల్ ఎంపీ టికెట్ కోసం వచ్చి..
- ఫామ్‌హౌజ్ వెళ్లకుండా దగ్గర్లో నిరీక్షించి.. నిరాశతో వెనక్కి
- కేసీఆర్ ఫామ్‌హౌజ్ వద్ద హైడ్రామా
గజ్వేల్/ములుగు, వెలుగు : గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్య..ఎమ్మెల్యే టికెట్దక్కకపోవడంతో పాటు పార్టీలో ఆదరణ లేదని ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.. మారిన రాజకీయ పరిణామాల మధ్య ఈయనకు ప్రత్యర్థిగా ఉన్న కడియం శ్రీహరి, తన కూతురు కావ్యతో కలిసి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో సీన్ రివర్స్ అయ్యింది. అభ్యర్థిగా ఎంపిక చేశాక కావ్య కారు దిగడంతో ఆ స్థానంలో రాజయ్యను ఎంపిక చేస్తారన్న ప్రచారం మొదలైంది.
ఈ క్రమంలో ఆయన శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవడానికి ఫామ్‌హౌజ్‌కు బయలుదేరారు. ఫామ్‌హౌజ్‌లో అప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన నాయకులతో టికెట్ విషయమై చర్చలు జరుగుతన్నాయన్న విషయం తెలుసుకున్న రాజయ్య ఫామ్హౌజ్సమీపానికి వచ్చి ఆగిపోయారు. తనకు టికెట్కన్ఫామ్ చేశాకే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుని
సమీపంలో ఓ బీఆర్ఎస్ నాయకుడి ఫామ్‌హౌజ్‌లో మూడు గంటలు వెయిట్చేశారు. కానీ, కేసీఆర్ ..రాజయ్యకు కాకుండా వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ పేరును ఖరారు చేశారు. తనకు టిక్కెట్ దక్కలేదని తెలుసుకున్న రాజయ్య అక్కడి నుంచి ఉసూరుమంటూ వెనుదిరిగారు.