
ముషీరాబాద్,వెలుగు: రజక ఫిషర్మెన్ రాష్ట్ర సొసైటీల కమిటీ ఆధ్వర్యంలో జరిగే రజకుల జన శంఖారావం ఆత్మగౌరవ సభ పోస్టర్ను తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వృత్తులకు అండగా ఉంటుందని తెలిపారు.
అనంతరం సొసైటీల వ్యవస్థాపక చైర్మన్ ఆమనగంటి సైదులు మాట్లాడుతూ రజకుల ఆర్థిక అభ్యున్నతికి జీవో 343 అమలు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈనెల 15న బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రజకుల సభకు రజకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాజీవ్ , రాజశేఖర్ తదితరులు ఆవిష్కరణలో ఉన్నారు.