మేడిగడ్డ కేసు గెలుస్తామనే నా భర్తను హత్య చేశారు: రాజలింగం మూర్తి భార్య సరళ

మేడిగడ్డ కేసు గెలుస్తామనే నా భర్తను హత్య చేశారు: రాజలింగం మూర్తి భార్య సరళ

మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కేసు వేసిన నాగవెల్లి రాజ లింగమూర్తి  దారుణ హత్యపై  మృతుడి కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 20న ఆందోళనకు దిగారు. హంతకులను పట్టుకునే వరకు అంత్య క్రియలు చేయమని మృతుడి ఫ్యామిలీ ధర్నా  చేశారు.  మేడిగడ్డ కేసు గెలుస్తాడనే తన భర్తను హత్య చేశారని ఆరోపించారు మృతుడి భార్య సరళ.భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన అనుచరులే తన భర్తను హత్య చేయించారని ఆరోపించారు.

మరోవైపు ఈ కేసు దర్యాప్తు పోలీసులు స్పీడప్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా చంపిన వారి కోసం పోలీసులు
గాలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మాజీ కౌన్సిలర్ భర్త లింగ మూర్తి కేసు వేశారు. అయితే.. రాజలింగమూర్తి ఫిబ్రవరి 19న రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. మంకీ క్యాపుల్లో వచ్చిన కొందరు ఆయనపై కత్తులు, గొడళ్లతో దాడి చేసి, చంపారు. 

Also Read :- పోటీ నుంచి తప్పుకుంటున్న బీఆర్ఎస్

మరో వైపు రాజలింగ మూర్తి హత్యను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన అనుచరులే చేశారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కొట్టి పారేశారు గండ్ర వెంకటరమణా రెడ్డి. మంత్రి ఆరోపణలు నిరాధార ఆరోపణలని అన్నారు. కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. హరీశ్ కు,తనకు  ఈ కేసుతో సంబంధం లేదన్నారు గండ్ర.