అంబేద్కర్ ​కాలేజీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

అంబేద్కర్ ​కాలేజీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ముషీరాబాద్, వెలుగు: బాగ్​లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల్లో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కాలేజీ ఫౌండర్ కాకా వెంకటస్వామి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా డాక్టర్ మంగాని రాజేందర్, అంబేద్కర్ ఇనిస్టిట్యూట్​డైరెక్టర్ వై.విష్ణుప్రియ పాల్గొని మాట్లాడారు. 

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం ఎన్​సీసీ, ఎన్ఎస్ఎస్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు భారత రాజ్యాంగంపై సెమినార్ నిర్వహించారు. భారత రాజ్యాంగంలోని లోతైన భావాలను వివరించారు.