SSMB29 స్టోరీ అప్డేట్: కాశీ చరిత్ర ఆధారంగా.. మహేష్ - రాజమౌళి మూవీ!

SSMB29 స్టోరీ అప్డేట్: కాశీ చరిత్ర ఆధారంగా.. మహేష్ - రాజమౌళి మూవీ!

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) మేకింగ్ థాట్ వేరే. ఎవ్వరికీ అంత త్వరగా అంతు చిక్కదు. లైఫ్‌స్టైల్ అడ్వెంచర్, ఇతిహాస కథనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దానికి తోడు హ్యూమన్ ఎమోషన్స్ను కళ్ళకు కట్టినట్లుగా చూపించి వరుస విజయాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో జక్కన్న తెరకెక్కిస్తున్న మహేష్ బాబు (SSMB29)కథపై చాలా ఊహాగానాలు ఊపందుకున్నాయి.

SSMB 29 సినిమా కథ అమెజాన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడీ వచ్చిన కొత్త లీక్‌ మాత్రం కాస్త కొత్త కోణాన్ని చూపిస్తోంది. అడ్వెంచర్ మాత్రమే కాకుండా, టెక్నాలజీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, మైథలాజి అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. SSMB 29 సినిమా చరిత్ర, పురాణాల మిశ్రమంగా ఉండబోతోందని సమాచారం. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో భారీ సెట్‌లో SSMB29 బృందం పవిత్ర కాశీ నగరాన్ని పునఃసృష్టిస్తోంది. శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసిందేకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడట. 

ALSO READ | Ilaiyaraaja: సూట్లో లండన్ వేదికపై ఇళయరాజా.. 82 ఏళ్ల వ‌య‌స్సులో ఏం చేస్తా అనుకోవ‌ద్దు

ఇకపోతే, రాజమౌళి ఎప్పుడూ పురాణాల పట్ల తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడూ వ్యక్తం చేస్తూనే ఉంటాడు. ఇది ఆయన చాలా సినిమాల్లోను,  స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ట్రెండ్ 'SSMB29'లో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి 'గరుడ', 'రుద్ర' అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో జక్కన్న పలు యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మూడ్రోజులుగా మహేష్-రాజమౌళి సినిమాకి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.