జక్కన్న మేకింగ్‌ చూశారా: ఆర్‌ఆర్‌ఆర్‌ డాక్యుమెంటరీ ట్రైలర్‌ రిలీజ్.. ఏ ఓటీటీలో చూడాలంటే?

జక్కన్న మేకింగ్‌ చూశారా: ఆర్‌ఆర్‌ఆర్‌ డాక్యుమెంటరీ ట్రైలర్‌ రిలీజ్.. ఏ ఓటీటీలో చూడాలంటే?

టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli). ఇపుడీ దర్శక దిగ్గజం మేకింగ్పై ఓ డాక్యుమెంటరీ రానుంది.

'RRR బిహైండ్ అండ్ బియాండ్' (RRR : Behind and Beyond) పేరుతో SS రాజమౌళి దర్శకత్వంపై డాక్యుమెంటరీని రానున్నట్లు ఇటీవలే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో రాజ‌మౌళి ఛైర్‌లో కూర్చొని సినిమా రీల్స్ మధ్య ఆలోచిస్తున్న పోస్టర్ తెగ ఆకట్టుకుంది.

తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ పేరుతో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం రాజమౌళి  మేకింగ్ ఎలా ఉందనేది.. ప్రేక్షకులకు తెర వెనుక ముచ్చట్లుగా చెప్పనున్నారు.

ALSO READ | మూతపడనున్న సంధ్య 70MM థియేటర్ ? పోలీసుల షోకాజ్ నోటీసుల్లో ఏముందంటే..!

రాజమౌళి ఇన్పుట్స్తో రామ్ చరణ్, ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారో.. ఈ ట్రైలర్ లో ఆసక్తిగా పొందుపరిచారు. తెలుగు సినిమాగా మొద‌లై ఆస్కార్ లెవెల్‌కు ఆర్ఆర్ఆర్ ఎలా చేరింది? సినిమా రూప‌క‌ల్ప‌న‌లో యూనిట్ ఎదుర్కొన్న స‌వాళ్లు, మూవీ సాధించిన అవార్డులు, రికార్డుల గురించి ఈ డాక్యుమెంట‌రీలో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 2022 మార్చిలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలవడమే కాదు ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకుంది. 

బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. ఇపుడు ‘బాహుబలి’,‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలతో లతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై మేకింగ్పై డాక్యుమెంటరీ రూపొందించడం స్పెషల్గా ఉంది. ఇకపోతే ఈ డాక్యుమెంటరీ పలు థియేటర్స్లో ఈ నెల (డిసెంబర్ 20న) రిలీజ్‌ కానుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.