హైదరాబాద్: టాలీవుడ్ ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేసిన సినిమా ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో.. రెబల్ స్టార్ ప్రభాస్, హ్యాండ్సమ్ హంక్ రానాతోపాటు రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా, బాహుబలి సిరీస్ కు కొనసాగింపుగా బాహుబలి 3 రానుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘పార్ట్ 3’ గురించి తనకు తెలియదంటూ ప్రభాస్ ఇటీవల స్పందించాడు. సమయం వచ్చినప్పుడు ఏమైనా జరగొచ్చన్నాడు.
ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి.. బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు మూడో పార్ట్ చేయాలనుందన్నాడు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బాహుబలి 3 రానుందని భావించొచ్చా అని అడిగిన ప్రశ్నకు.. ‘తప్పకుండా భావించొచ్చు’ అని ఆయన జవాబిచ్చాడు. ‘బాహుబలి చుట్టూ ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. మా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. దీన్ని చూపించడానికి కాస్త టైమ్ పట్టొచ్చు. కానీ బాహుబలి నుంచి ఆసక్తికరమైన న్యూస్ రానుంది’ అని రాజమౌళి చెప్పాడు.
మరిన్ని వార్తల కోసం: