టాలీవుడ్లో ప్రతి సంవత్సరం ఓ రెండు..మూడు పెద్ద మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో కొన్ని తమ అభిమాన నటుడు ఉండటం వల్ల, మరికొన్ని డైరెక్టర్కి ఉండే విజన్ వల్ల. కానీ, ఇప్పుడు మాట్లాడుకునేది ఒక హీరో, డైరెక్టర్ గురుంచి మాత్రమే కాదు.
మొదట కథను రాసే రచయిత నుంచి సినిమాను విజువల్గా మలిచే సినిమాటోగ్రాఫర్ వరకు. ఇలా ఒక్కరెంటి..సినిమాలో 24 క్రాఫ్ట్స్లో పనిచేసే ఆరితేరిన అద్భుత టెక్నిషియన్స్ గురించి. అదేనండీ..రాజమౌళి తెరకెక్కించబోయే..మహేష్ సినిమా. ప్రస్తుతం ఈ మూవీ కోసం సినిమా అభిమానులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారనేది స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు.
మరి ఈ సినిమా అప్డేట్స్ ఏంటో చూద్దామా..
- రాజమౌళి..మహేష్ కాంబోలో రాబోయే ఈ మూవీకి సంబందించిన కథ సిద్దమైనట్లు సమాచారం.
- ఫిబ్రవరి లేదా మార్చిలో రాజమౌళి ఒక ప్రత్యేక వర్క్ షాప్ ని రెడీ చేస్తున్నట్టు సమాచారం.ఇందులో మహేష్ అండ్ టీమ్ జాయిన్ కాబోతున్నారు.
- ఇక ఈ ఏడాది 2024 ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ కానుంది.
- ఈ సినిమా షూటింగ్కి సంబందించిన లోకేషన్స్ వేట కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
- ఈ సినిమా షూటింగ్ మొత్తం వరల్డ్ వైడ్ గా మూడు దేశాల్లో షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం.
- మోస్ట్ ఫారెస్ట్ అడ్వెంచర్స్ గా తెరకెక్కించే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్..అమెజాన్ అడవుల్లో కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం.
- ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ని రాజమౌళి అంచనాల ప్రకారం..రూ.1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.
- ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఓ ప్రముఖ హాలీవుడ్ స్టూడియో కెఎల్ నారాయణతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
- ఈ సినిమాలో మరికొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్ వేయబోతున్నారు.
బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి. పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి మహేష్ తో సినిమాని ఏ రేంజ్ లో చూపిస్తున్నాడో తెలియాలంటే ఇంకో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే.!
ప్రస్తుతం హీరో మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసి..దుబాయ్ ట్రిప్ లో ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న రిలీజ్ కానుంది.