సినీ పరిశ్రమ సహించదు: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రాజామౌళి

సినీ పరిశ్రమ సహించదు: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రాజామౌళి

నటులు నాగచైతన్య, సమంత డివోర్స్ ఇష్యూపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గా్ల్లో కాక రేపుతున్నాయి. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో మంత్రి కొండా సురేఖ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముక్త కంఠంతో ఖండించగా.. తాజాగా మంత్రి సురేఖ కామెంట్స్‏పై ప్రముఖ దర్శకుడు రాజమౌళి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాజమౌళి.. ‘‘హుందాతనంగా వ్యవహరించి గౌరవాన్ని కాపాడుకోండి’’ అని హితవు పలికారు. ప్రత్యేకించి ప్రభుత్వ అధికారులు చేస్తే నిరాధార ఆరోపణలు సహించలేనివని అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టోలరేట్ అనే హ్యాష్ ట్యాగ్‎ను ఈ ట్వీట్‎కు  జత చేశారు రాజమౌళి.

Also Read :- పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే " కెవ్వు కేక " పాట గుర్తొస్తుంది.. భూమన

ఇదిలా ఉంటే, సమంత, నాగచైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారు. సమంతకు క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ.. విడాకులు, అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ తన కుటుంబపై సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖపై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడిన కొండా సురేఖపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని నాగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.