హైదరాబాద్: బాహుబలి రెండు పార్ట్ లతో పోల్చుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీ పెద్ద రేంజ్ లో ఉంటుందని దర్శక ధీరుడు రాజమౌళి అన్నాడు. ఈ సినిమాను మార్చి 25న ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామని హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జక్కన్న తెలిపాడు. కార్యక్రమంలో రాజమౌళితోపాటు ఆర్ఆర్ఆర్ లో కొమురం భీమ్ గా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న రామ్ చరణ్ తేజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ గురించి జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు వాళ్లు సమాధానాలు ఇచ్చారు. తారక్ ఓ సూపర్ కంప్యూటర్ లాంటి వాడని రాజమౌళి మెచ్చుకున్నాడు. ఇక షూటింగ్ టైమ్ లో చాలాసార్లు చరణ్ తన నటనతో ఆశ్చర్యానికి గురి చేశాడని ప్రశంసించాడు. ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోల గురించి తానేం చెప్పలేనని.. ఈ విషయంపై డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకుంటారన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ ఉక్రెయిన్ లో కొంత భాగం షూట్ చేసుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. దీనిపై జక్కన్న స్పందించాడు. ఉక్రెయిన్ లో తమ సినిమా కోసం పని చేసిన వారి గురించి ఆందోళన చెందుతున్నానని చెప్పాడు.
#SSRajamouli (@ssrajamouli), who is ready to witness the release of his mammoth project '#RRR', has said that he is worried about his crew who worked on the 'RRR' shoot in #Ukraine. #RussiaUkraineWar #RussiaUkraineConflict #RussiaUkraineCrisis
— IANS (@ians_india) March 15, 2022
Photo: IANS (File) pic.twitter.com/BbKdmdQ58b
వాళ్లతో మల్టీస్టారర్ చేయాలనుంది: ఎన్టీఆర్
తెలుగు సినిమా కొత్త దశకు చేరుకుంటోందని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ఇకపై టాలీవుడ్ నుంచి మరిన్ని మల్టీస్టారర్ సినిమాలను ఆశించొచ్చన్నాడు. చరణ్ అద్భుతమైన వ్యక్తి అని.. అలాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని పేర్కొన్నాడు. కొవిడ్ కారణంగా చాలా టైమ్ కోల్పోయామని.. ఇదొక్కటి తప్పితే ఆర్ఆర్ఆర్ ఔట్ పుట్ విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నామన్నాడు. ‘నాటు నాటు’ పాట బిగ్ స్క్రీన్స్ పై చూస్తే అద్భుతంగా ఉంటుందని, ఈ సాంగ్ తమ ఇద్దరి ఫ్యాన్స్ కు పండుగలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. తన బాబాయ్ బాలకృష్ణతోపాటు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలసి మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని ఉందని వివరించాడు.
మరిన్ని వార్తల కోసం: