సెస్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి

రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నిక పూర్తయింది. కొత్తగా ఎన్నికైన 15 మంది  డైరెక్టర్ల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు.   సిరిసిల్ల టౌన్ -1  డైరెక్టర్ గా  దిడ్డి రమాదేవి (BRS),  సిరిసిల్ల టౌన్ -2 డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ (BRS) ఎన్నికయ్యారు.  

వేములవాడ రూరల్ రిజల్ట్ పై రీ కౌంటింగ్ 

వేములవాడ రూరల్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారని ఎన్నికల అధికారి మమత ప్రకటించిన కాసేపటికే రీకౌంటింగ్కు ఆదేశించారు. ఫలితంపై అభ్యంతరం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నేతలు రీకౌంటింగ్కు పట్టుబట్టారు. దీంతో 15 నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల అధికారి ఓట్లు మళ్లీ లెక్కించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతల లాబీయింగ్కు ఎన్నికల అధికారి తలొగ్గారని, పోలీసులు ఇతర అధికారులు సైతం వారికే మద్దతు తెలుపుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రీకౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కౌంటింగ్ కేంద్రం నుంచి అందరినీ బయటకు పంపిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 1379, బీఆర్ఎస్ అభ్యర్థికి 1372 ఓట్లు వచ్చాయి. 7 ఓట్ల తేడాతో  బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారు. అయితే ఫలితం ప్రకటించిన 15 నిమిషాల్లోనే ఎన్నికల అధికారి రీకౌంటింగ్ కు ఆదేశించారు.

బీజేపీ ఆందోళన..దొగొచ్చిన అధికారులు

సెస్ ఫలితాల్లో గందరగోళం కంటిన్యూ అవుతోంది. వేములవాడ రూరల్ బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు మొదట ప్రకటించారు అధికారులు. అయితే మెజార్టీ 5 ఓట్లు మాత్రమే ఉండటంతో.. మళ్లీ రీ కౌంటింగ్ చేయాలని brs నేతలు ఆందోళనకు దిగారు. ఇదే టైంలో బీజేపీ నేతలు కూడా ఆందోళన చేశారు. అధికారులు, పోలీసులు brsకు వత్తాసు పలుకుతున్నారని బీజేపీ లీడర్లు ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలు కౌంటింగ్ కేంద్రం ముందు బైఠాయించారు. ఇదే టైంలో రెండు పార్టీల నేతలు గొడవకు దిగడంతో పోలీసులు స్వల్ప లాఠిచార్జి చేశారు. దీంతో అధికారులు దిగవచ్చి బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. 

గందరగోళం మధ్యే వేములవాడ రూరల్ అభ్యర్ధిని ప్రకటించారు ఎన్నికల అధికారులు. బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. తిరుపతి గెలుపుతో బీజేపీ కార్యకర్తల సంబురాలు చేసుకుంటున్నారు. అయితే అంతకు ముందు కౌంటింగ్ కేంద్రం ముందు కేంద్రం దగ్గర BRS, BJP కార్యకర్తల గొడవకు దిగారు. దీంతో స్వల్ప లాఠిచార్జితో పోలీసులు చెదరగొట్టారు. బీజేపీ ఆందోళనతో ఎన్నికల అధికారులు దిగివచ్చారు. 

బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం

రాజన్న సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో మరో ఫలితం వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 1379, బీఆర్ఎస్ అభ్యర్థికి 1372 ఓట్లు వచ్చాయి.  ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి. అయితే దీనిపై BRS నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రీ కౌంటింగ్ కోసం పట్టుబడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

సెస్ ఎలక్షన్స్ ఫలితాలు

రుద్రంగిలో బీఆర్ఎస్ బలపరిచిన ఆకుల గంగారం అనే అభ్యర్థి 36 ఓట్లతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థికి 523, స్వతంత్ర అభ్యర్థికి 487 ఓట్లు లభించాయి. 

హోరాహోరీగా జరిగిన సెస్ ఎన్నికలు 

ఈనెల 24వ తేదీన (శనివారం)  సిరిసిల్ల సహకార విద్యుత్​ సరఫరా సంఘం(సెస్​) ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్​ మొదలుకాగా.. 13 మండలాలతో పాటు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఉన్న 87,130 మంది ఓటర్లకు గాను 73,189 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84 శాతం పోలింగ్ నమోదైంది. 15 డైరెక్టర్​ పోస్టుల కోసం జరిగిన ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు, రెబెల్స్​ కలిపి 75 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 

ప్రతిష్టాత్మకంగా సెస్ ఎన్నిక

సెస్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. సెస్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ వేడి మామూలుగా ఉండదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సెస్ ఎన్నికలు అలాగే జరిగాయి. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కావటంతోనే ఈ హీట్ కొనసాగుతోంది. 

రెండు ప్రధాన శాసనసభ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో మరో రెండు మండలాల్లో నిర్వహించనున్న సెస్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు జరిగినా, ఆయా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో నిలిచారన్న  విషయం అందరికీ తెలిసిందే.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కీలకంగా ఉన్న సెస్ పరిధిలో 2.81 లక్షల సర్వీస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో బకాయిదారులు ఓటు హక్కు కోల్పోగా 87130 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు నామినేషన్ రుసుము రూ.వెయ్యి, బీసీలకు రూ.2 వేలు, ఇతరులకు రూ 4 వేలుగా నిర్ణయించారు. 

ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులే 

సహకార చట్టం ప్రకారమే ఎన్నికల నిబంధనలకు లోబడి ఏర్పాట్లు చేశారు.సెస్ ఎన్నికల్లో డైరెక్టర్ స్థానాలకు పోటీ చేసే వారు వారికి ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు. ఎన్నికలు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తుండడంతో ఎన్నికల కోడ్, వ్యయ నియంత్రణ ఉండదు.