ప్రభుత్వ భూములు కాపాడాలంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆందోళన 

రాజన్న సిరిసిల్ల జిల్లా : తంగళ్లపల్లి మండల కార్యాలయంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో బీజేపీ ఎంపీటీసీలు ఆందోళనకు దిగారు. రామాలయం భూములను కబ్జా చేసిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ సమావేశంలో బీజేపీ ఎంపీటీసీలు నిరసన తెలిపారు. దీంతో సమావేశం నుండి బీజేపి ఎంపీటీసీలను పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. 

మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేపట్టారు. అక్రమంగా వెంచర్లు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండల సర్వ సభ్య సమావేశంలోకి కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు.