- లీడర్ల వద్దకు ఆశావాహులు క్యూ కడుతున్న ఆశవాహులు
రాజన్న సిరిసిల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులపై కాంగ్రెస్ నాయకుల్లో ఆశలు మొదలయ్యాయి. జిల్లాలో 13 మండలాలు ఉండగా 9 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వేములవాడ నియోజక వర్గంలోని వేములవాడ,రుద్రంగి, బోయిన్ పల్లి, కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ మార్కెట్ కమిటీలు ఉండగా.. సిరిసిల్ల నియోజక వర్గంలో సిరిసిల్ల, ఇల్లంతకుంట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట ఉన్నాయి. వీటికి త్వరలోనే కొత్త పాలక వర్గాలను నియమించనున్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో మార్కెట్ కమిటీ పాలక వర్గాలు మున్నాళ్ల ముచ్చటగానే సాగింది. 2022 డిసెంబర్ లో ఏఎంసీల పాలక వర్గాలు రద్దయ్యాయి. 8 నెలల తర్వాత 2024 సెప్టెంబర్ లో అసెంబ్లీ ఎలక్షన్ ముందు జిల్లాలో కేటీఆర్ హడావుడి చేసి ఎనిమిది మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమించారు. ప్రభుత్వం మారడంతో ఆ కమిటీలు రద్దయ్యాయి. అక్టోబర్ లోనే ఎలక్షన్ కోడ్ రావడంతో కొంత మంది చైర్మన్ లు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేస్తారన్న వార్తలతో ఆశావాహులు లీడర్ల వద్దకు క్యూ కడుతున్నారు. - వేములవాడ
నియోజక వర్గంలో నాలుగు మార్కెట్ కమిటీలుండగా, చైర్మెన్ పదవి కోసం ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చుట్టు నేతలు తిరుగుతున్నారు. సిరిసిల్ల నియోజక వర్గంలోని నాలుగు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి చుట్టూ ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.