కొనసాగుతున్న సిరిసిల్ల సెస్ ఎన్నికల కౌంటింగ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సహకార విద్యుత్​ సరఫరా సంఘం (సెస్) ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 15 మంది అభ్యర్థుల భవితవ్యం..మరి కొద్ది గంటల్లో తేలనుంది. వేములవాడ జూనియర్ కళాశాలలో సెస్ పోలింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సెస్ ఎన్నికల్లో 15 స్థానాల్లో 75 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఉన్న 87,130 మంది ఓటర్లకు గాను 73,189 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84 శాతం పోలింగ్ జరిగిందని ​ఎన్నికల అధికారులు తెలిపారు.

వేములవాడకు సంబంధించి ఏడు కౌంటింగ్ కేంద్రాలు, సిరిసిల్లకు సంబంధించి 8 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 స్థానాలకు తక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న రుద్రంగి, వీర్నపల్లి స్థానాల్లో తొలి ఫలితం రానుంది. రేపు సెస్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరగనుంది.