రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దని ఆదేశించారు. వివిధ సమస్యలపై 122 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి వెంటనే పరిష్కరించాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 32 ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు. 60 ఏండ్ల కింద నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలివ్వాలని జగిత్యాల రూరల్ మండలం బావోజిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.