మెనూ ప్రకారం భోజనం అందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మెనూ ప్రకారం భోజనం అందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వేములవాడ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం భోజనం అందించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్ కుమార్ ఝా సంక్షేమ హాస్టళ్ల అధికారులను ఆదేశించారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని బీసీ సంక్షేమ హాస్టల్ ను తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్‌‌‌‌‌‌‌‌లోని విద్యార్థుల వసతి గదులు, పరిసరాలు, స్టోర్ రూం, కిచెన్ గదిని పరిశీలించారు.

డిప్లొమా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడారు. రోజూ మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నారా? అని ఆరా తీశారు. ప్రణాళిక ప్రకారం పరీక్షలు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలని సూచించారు. హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఎందరు విద్యార్థులు ఉంటున్నారో వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను ఆరా తీశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. 

వెలుగు క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరణ 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజల పక్షాన ఉంటూ ‘వీ6వెలుగు’ పత్రిక నికార్సయిన వార్తలు అందిస్తోందని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా పేర్కొన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ప్రముఖ కవి జూకంటి జగన్నాథంతో కలిసి ‘వెలుగు’ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. అంతకుముందు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఆమె ఫొటోకు నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఈవో జగన్ మోహన్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.