రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డుపై నిలుచున్న ఆరేళ్ల చిన్నారిని స్కార్పియో ఢీకొంది. దీంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
వరంగల్ జిల్లాకు చెందిన కొట్టెం పద్మ తన కూతురు స్వాతి(6), కొడుకులు గణేష్, నరేష్ లతో బంధువుల ఇంటికి వెళ్లడానికి ఎల్లారెడ్డిపేట మండలం గాజులపల్లి శివారు గ్రామ బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన స్కార్పియో రోడ్డుపై నిలచ్చున్న చిన్నారి స్వాతిపైకి దూసుకెళ్లింది. దీంతో స్వాతి అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో స్వాతి తల్లి, సోదరులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ALSO READ: Video Viral: నెత్తిపై ఫ్రిజ్... సైకిల్ తొక్కుతున్న యువకుడు
ఈ ప్రమాదానికి కారణమైన కారు సింగారం గ్రామానికి చెందిన షేక్ అజీజ్ కు చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.