కూలీలతో వెళ్తున్న ప్యాసింజర్ ఆటో బోల్తా.. ఒకరు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ప్యాసింజర్ మంగళవారం(డిసెంబర్ 19) ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై వెళ్తున్న కోతులను తప్పించబోయి ఆటో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా వేములవాడ అర్బన్ మండలానికి చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలయాల్సి ఉంది.