రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఎస్ఐ పనితీరు వివాదాస్పదంగా మారింది. మద్యం తాగి వాట్సప్ స్టేటస్ లు పెట్టడం వైరల్ గా మారింది. తాను చనిపోతే తన మామే కారణమంటూ ఆరోపణలు చేయడం ఇపుడు పోలీస్ డిపార్ట్ మెంట్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.
జిల్లా పోలీస్ శాఖలో సిసిఎస్ ఎస్ఐగా పని చేస్తున్న బోయిని పరుశ రాములు వాట్సాప్ స్టేటస్ లు వైరల్ అవుతున్నాయి. కుటుంబ కలహాలతో చనిపోతున్నానంటూ ఇటీవలే వీడియో పోస్ట్ చేసిన ఆయన.. నిన్న మద్యం సేవిస్తూ వీడియో స్టేటస్ పెట్టడం వైరల్ గా మారింది. తాను, తన పిల్లలు చనిపోతే ఆ చావుకి కారణం తన మామ దయ్యాల శ్రీనివాస్ తో పాటు మరి కొంతమంది బంధువులే కారణమని ఆరోపణలు చేశాడు. సిరిసిల్లలోని తన ఇంటి దగ్గరకు వచ్చి తనని గొంతు పిసికి చంపే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశాడు. అయితే గత కొన్ని రోజులుగా ఎస్ఐ మానసికి స్థితి సరిగా లేదని తెలుస్తోంది. ఎస్ఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం పోలీస్ శాఖలోనూ వివాదాస్పదంగా మారింది.