రాజన్నసిరిసిల్ల, వెలుగు : స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ టెస్ట్‌లు చేస్తే చర్యలు తప్పవని రాజన్నసిరిసిల్ల డీఎంహెచ్‌వో రజిత హెచ్చరించారు. శుక్రవారం అడ్వజరీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో పీసీసీ ఎన్టీ బోర్డులను, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, సిబ్బంది, ధరల పట్టికలను ప్రదర్శించాలన్నారు. స్కానింగ్ సెంటర్లు ఇచ్చే టెస్ట్ సర్టిఫికెట్ల మీద రేడియాలజిస్ట్ పేరును తప్పక రాయాలన్నారు.
లింగ నిర్ధారణ చేస్తే రూ.10వేల జరిమానాతో పాటు 3 ఏండ్ల శిక్ష కూడా పడుతుందన్నారు. సమావేశంలో జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, గైనకాలజిస్ట్ శోభరాణి, డాక్టర్ అంజలి నా ఆల్ఫ్రెడ్, డీపీఆర్‌వో శ్రీధర్, లీగల్ అడ్వయిజర్ శాంతి ప్రకాశ్‌శుక్ల, ఎన్జీవో ప్రెసిడెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మెట్‌పల్లి, వెలుగు : స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జైపాల్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని నాలుగు స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, ఆన్ లైన్ వివరాలు పరిశీలించారు. వినాయక స్కానింగ్ సెంటర్ పై ఫిర్యాదులు రావడంతో తనిఖీ చేసి మెమో జారీ చేసినట్లు తెలిపారు.