రౌడీ షీటర్లు ప్రవర్తన మార్చుకోవాలి : ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాజన్​

 రౌడీ షీటర్లు ప్రవర్తన మార్చుకోవాలి : ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాజన్​

వేములవాడ, వెలుగు : రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో తమ జీవితాలను సరిదిద్దుకోవాలని రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్​మహాజన్​ అన్నారు. గురువారం వేములవాడ టౌన్, రూరల్, బోయినిపల్లి స్టేషన్ల పరిధిలోని రౌడీషీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిస్టరీ ఉన్నవారికి వేములవాడ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ నేరాల్లో రౌడీషీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిస్టరీ ఉన్నవారిపై నిత్యం పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, పృథ్వీందర్ గౌడ్, అంజయ్య పాల్గొన్నారు. 

గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై అవగాహన

పోక్సోపై చైతన్యం కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణ పరిధిలోని నాంపెల్లి వద్ద గల ఓ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బాలబాలికలకు గుడ్, బ్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోక్సో చట్టాలపై ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి అవగాహన కల్పించారు. ఆమె వెంట డీడబ్ల్యూవో పి.లక్ష్మీరాజం, షీ టీం ఏఎస్ఐ ప్రమీల, కోఆర్డినేటర్ రోజా, స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది పాల్గొన్నారు.