బోయినిపల్లి, వెలుగు: నిత్యం ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం మిడ్ మానేర్ లో కాసేపు సరదాగా గడిపారు. మండలంలోని వరదవెల్లి వద్ద మిడ్ మానేర్ బ్యాక్ వాటర్‌లో ఎస్పీ, వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, బోయినిపల్లి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ తో కలిసి కొద్దిసేపు బోటింగ్ చేశారు.