సిద్దిపేట పోలీసుల పనితీరు బాగుంది : రమేశ్​నాయుడు

సిద్దిపేట రూరల్, వెలుగు : శాంతి భద్రతల విషయంలో సిద్దిపేట పోలీసుల పనితీరు బాగుందని రాజన్న సిరిసిల్ల జోన్  డీఐజీ కే.రమేశ్​నాయుడు అభినందించారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా సీపీ ఆఫీస్ ను ఆయన సందర్శించారు.  కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏఆర్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఎస్కార్ట్, గార్డ్స్,  వీఐపీ బందోబస్తు, తదితర అంశాల గురించి  తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. సీపీ ఆఫీస్ లో 5ఎస్ ఇంప్లిమెంటేషన్ అద్భుతంగా ఉందన్నారు.

ALSO READ : IND vs AUS : మొహాలీలో మనకంటే ఆస్ట్రేలియానే తోపు

సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్స్ తో పాటు జిల్లాలో ఉన్న సర్కిల్స్, పోలీస్ స్టేషన్ ల వివరాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధి, జిల్లా భౌగోళిక పరిధిని సీపీ ఎన్. శ్వేత ఆయన వివరించారు. అనంతరం ఏసీపీ ఆఫీస్ ను సందర్శించిన ఆయన రికార్డ్స్ ను, సీడీ ఫైల్స్ ను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతా బాగుందని ఏసీపీ సురేందర్ రెడ్డిని,  సిబ్బందిని అభినందించారు. ఆ తర్వాత  సిద్దిపేట రూరల్ సర్కిల్ ఆఫీస్ ను, సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.  

సీఐ చేరాలు, ట్రాఫిక్ ఏసీపీ ప్రసన్నకుమార్, ట్రాఫిక్ సీఐ రామకృష్ణ ను అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లు అందె శ్రీనివాసరావు, ఎస్ మల్లారెడ్డి. ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామ్ చందర్రావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు సురేందర్ రెడ్డి, చంద్రశేఖర్, ఎస్బీ ఇన్స్​పెక్టర్​ రఘుపతి రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్​పెక్టర్ గురుస్వామి పాల్గొన్నారు.