రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల విషయంలో రైతుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరిని ఒకరు పెద్ద పెద్ద కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. వారందరికి ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగిలాయి. కొందరికైతే తలలు పడిలి.. రక్తం కారుతుంది. పోలీసులు ఆపినా ఆగకుండా.. వారిముందే పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో పొడు భూముల విషయంలో రైతుల మధ్య గొడవ జరిగింది. భూమి ఒకరి పేరుపై పట్టా ఉంటే.. మరొకరు ఆ భూమని కబ్జా చేశారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా సార్లు గొడవలు జరిగాయి. నిన్న సాయంత్రం(అక్టోబర్ 08) పోడు భూముల విషయంలో మళ్లీ గొడవ జరిగింది. భూమి నాది అంటే నాదని ఒకరినొకరు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా తీవ్ర ఆగ్రహనికి గురైన ఓ రైతు ముందుగా మరో రైతుపై పెద్ద కర్రతో కొట్టాడు. ఇలా ఒకరిని ఒకరు వెంటపడి కొట్టుకున్నారు.
ALSO READ : Cricket World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్ననెదర్లాండ్స్ .. రెండో మ్యాచుకు విలియంసన్ దూరం
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి గొడవను ఆపడానికి ప్రయత్నంచారు. కానీ వారు పోలీసుల మాటను కూడా లేక్కచేయకుండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
అక్కడే ఉన్న ఓ స్థానికుడు ఈ గొడవను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఈ ఘర్షణలో భీమ్ జీ, చంద్రకాంత్ అనే రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.