సర్కార్ దవాఖానలో బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి

  • ఆదర్శంగా నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా
  • వేములవాడ జూనియర్​ సివిల్​ జడ్జి జ్యోతిర్మయి 


వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్​ సివిల్​ కోర్టు జడ్జి జ్యోతిర్మయి ఏరియా హాస్పిటల్‌లో డెలివరీ అయ్యారు. బుధవారం నార్మల్​డెలివరీ కాగా ఆడబిడ్డ పుట్టింది. హైదరాబాద్​కు చెందిన జడ్జి జ్యోతిర్మయి ఇటీవలే వేములవాడకు బదిలీపై వచ్చారు. మంగళవారం వరకు ఆమె విధులు నిర్వర్తించారు.  బుధవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో ఏరియా దవాఖానలో అడ్మిట్​చేశారు.  డాక్టర్​చైతన్య సుధా ఆమెకు డెలివరీ చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్​ తెలిపారు.