భక్తులతోకిక్కిరిసిపోయిన రాజన్న గుడి

సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతోకిక్కిరిసిపోయింది. అసలే సోమవారం, ఆ పై హాలిడే కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసాద కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి 4గంటల సమయం పట్టిందని తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వాగతం పలికారు. ఆలయ ఈఓ కృష్ణప్రసాద్​స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. వారి వెంట బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఉన్నారు.

- వేములవాడ, వెలుగు