లిక్కర్​ తెలంగాణ కాదు.. విజ్ఞాన తెలంగాణ కావాలి : శనిగారపు  రజనీకాంత్

  •      రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్ ‌‌ ముట్టడి 

సిరిసిల్ల టౌన్, వెలుగు : వైన్స్ ‌‌ తెలంగాణ కాదు విజ్ఞాన తెలంగాణ కావాలని ఎస్ఎఫ్ ‌‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగారపు  రజనీకాంత్ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సోమవారం 500మంది విద్యార్థులతో రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో బంగారు తెలంగాణ అంటే వైన్స్​షాపులు పెంచడం కాదని, అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

ALSO READ : బాలికకు న్యాయం చేయాలంటూ రాస్తారోకో.. మీర్​పేటలో అఖిలపక్షం నిరసనల్లో ఉద్రిక్తత

పెండింగ్ లో ఉన్న స్కాలర్ ‌‌ ‌‌షిప్​ బకాయిలు  తక్షణమే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్​పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు రాకేశ్ ‌‌, మనోజ్, పాల్గొన్నారు.