భోజనం బాగుందా.. స్కూల్​ డ్రెస్​ ఇచ్చారా.. :  కలెక్టర్​ హనుమంతు జెండగే 

భోజనం బాగుందా.. స్కూల్​ డ్రెస్​ ఇచ్చారా.. :  కలెక్టర్​ హనుమంతు జెండగే 

రాజాపేట, వెలుగు : స్కూల్​లో అందిస్తున్న భోజనం బాగుందా..? అందరికీ స్కూల్​డ్రెస్​ ఇచ్చారా..? అని స్టూడెంట్స్​ను కలెక్టర్​హనుమంతు జెండగే అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రాజాపేట మండలం పాముకుంట, కాషగూడెం ప్రభుత్వ స్కూళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ  సందర్భంగా స్కూల్స్​లో పరిసరాలను పరిశీలించారు. భోజనం వండుతున్న తీరును గమనించారు.

కొందరు స్టూడెంట్స్​స్కూల్ డ్రెస్​ లేకుండా ఉండడం గమనించిన ఆయన 'అందరికీ స్కూల్​ డ్రెస్​ ఇచ్చారా.?' అని అడిగారు. నాలుగు, ఆరో తరగతి చదువుతున్న స్టూడెంట్స్​తో పాఠ్యాంశాలను చదివించారు. అనంతరం అంగన్​వాడీ సెంటర్​ను ఆయన సందర్శించారు. పిల్లల హాజరు రిజిస్టర్, స్టాక్​ రిజిస్టర్, బియ్యం, పాల ప్యాకెట్లు, కోడి గుడ్లను పరిశీలించారు. చిన్నారులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దామోదర్, ఎంపీడీవో నాగవేణి, ఎంఈవో రమేశ్, అంగన్​వాడీ టీచర్ కృష్ణవేణి తదితరులు ఉన్నారు.