ఆదిలాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గౌస్ఆలంతో కలిసి మాట్లాడారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు.
26న నామినేషన్ల స్క్రూటినీ, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. జూన్ 6 తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.