
- కలెక్టర్లు రాజర్షి షా, క్రాంతి, గరిమా అగర్వాల్
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అప్పుడే ప్రజలకు అధికారుల పట్ల నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం మెదక్ కలెక్టర్ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డబుల్బెడ్రూం, భూ సమస్యలు, రేషన్‌కార్డు బాధితుల నుంచి వినతులు వచ్చాయన్నారు. మొత్తం 95 ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మశ్రీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట టౌన్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపించాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా దళితబంధు బాధితులు, మన ఊరు మన బడి పనుల పెండింగ్ బిల్లులు, పంట నష్టం డబ్బుల గురించి వినతులు వచ్చాయి. మొత్తం ప్రజావాణికి మొత్తం 27 అర్జీలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చిన సమస్యలను అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్క్రాంతి అధికారులకు సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో పలువురు బాధితుల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అక్రమంగా మైనింగ్ పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా నలుమూలల నుంచి బాధితులు కలెక్టరేట్ కు తరలివచ్చి ఫిర్యాదు చేశారు.
అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 76 అప్లికేషన్లు రాగా ఇందులో రెవెన్యూ శాఖ 27, మిగతావి 49 శాఖలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. గ్రీవెన్స్ లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్ఓ నగేశ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.