29 రోజుల్లో ఎన్నికలు.. ఫాంహౌజ్లో కేసీఆర్ రాజశ్యామల యాగం

ఎన్నికల ముందు  సీఎం కేసీఆర్ మరో యాగానికి శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని తన ఫామ్ హౌజ్ లో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. నవంబర్ 1న తెల్లవారుజామున 3 గంటలకు యాగం ప్రారంభమయ్యింది  మూడు రోజులు పాటు ఈ యాగం జరగనుంది. కేసీఆర్ఆయన సతీమణితో కలిసి రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు.  

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో ఈ యాగం జరుగుతోంది.. తెలంగాణ ,ఆంద్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు పాల్గొంటున్నారు. 200 మంది వైదికులు యాగంలో పాల్గొంటున్నారు.  రెండో రోజు వేదపారాయణలు, హోమం,తదితర క్రతువులు. మూడో రోజు  పూర్ణాహుతి జరుగుతుంది.  

యాగాలు చేయడం ద్వారా విజయాలు వరిస్తాయని కేసీఆర్ నమ్మకం. బీఆర్ఎస్  అధికారంలోకి  వచ్చాక తొలిసారి 2015లో చండీయాగం చేసిన సంగతి తెలిసిందే..మరోసారి 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు.  తర్వాత కేసీఆర్ రెండోసారి  ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టారు.  ఎన్నికల్లో విజయం తర్వాత సహస్ర చండీయాగం చేశారు. బీఆర్ఎస్ గా దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఢిల్లీలో మరోసారి యాగం నిర్వహించారు కేసీఆర్. ఇపుడు నవంబర్ 30న ఎన్నికలు జరగుతుండటంతో కేసీఆర్ రాజశ్యామల యాగం చేస్తున్నారు. 

ALSO READ :- NZ vs RSA: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఓడితే పాక్, ఆఫ్గన్ సెమీస్ రేసులోకి