కరీంనగర్, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణకు బదులు అప్పుల తెలంగాణ అయిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తో కలిసి కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
అనంతరం రాజాసింగ్ విలేకరులతో మాట్లాడారు. అందరి ఆశీర్వాదంతో తాను మళ్లీ పార్టీలోకి వచ్చానని, తనకు ఫస్ట్ లిస్టులోనే మళ్లీ టికెట్ కూడా వచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేయాలని తాము అమ్మవారి ముందు సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారున్న చోట డబుల్ డెవలప్ మెంట్ అవుతుందన్నారు.