కొత్త ఎక్సైజ్ పాలసీ మోసం: గెహ్లాట్

కొత్త ఎక్సైజ్ పాలసీ మోసం: గెహ్లాట్

జైపూర్: కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన సుంకాలు కూడా పే చేయడం లేదని మండిపడ్డారు. సోమవారం పలు ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రాలకు అందజేసే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తొలగించిందన్నారు. దాని స్థానంలో కొత్త ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టిందన్నారు.

వీటిలో అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీస్ 1, 2, సెస్సులు ఉన్నాయని తెలిపారు. వీటిని రాష్ట్రాలకు చెల్లించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బును తమ ఖాతాలోకి మళ్లిస్తుండటంతో రాష్ట్రాలు తమ వాటాను పొందలేకపోతున్నాయని తెలిపారు.