అవసరమైతే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం..

బీజేపీ కుట్రను సాగనివ్వం: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
రాష్ట్రపతి భవన్, ప్రధాని ఇంటి ముందు ప్రొటెస్ట్ చేస్తాం
ఎమ్మెల్యేలతో హోటల్ లో గెహ్లాట్ మీటింగ్
అసెంబ్లీ నిర్వహించాలని మరోసారి డిమాండ్

జైపూర్: అసెంబ్లీలో బల పరీక్ష జరగకుండా బీజేపీ కుట్ర చేస్తోందని, దీన్నిఅడ్డుకునేందుకు అవసరమనుకుంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. శనివారం ఈ మేరకు ఎమ్మెల్యేలతో ఆయన మీటింగ్ నిర్వహించారు. ‘‘బీజేపీ కుట్రను సాగనివ్వను. అవసరం అనుకుంటే రాష్ర్టపతి భవన్ కు వెళ్తా. రాష్ట్రపతి భవన్ లేదా ప్రధాన మంత్రి రెసిడెన్స్ దగ్గర పికెట్ చేయాల్సివస్తే ఇస్తాం. అక్కడ ప్రొటెస్ట్ కూడా చేస్తాం’’ అని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేలంతా సపోర్టుగా చేతులెత్తారు. ‘‘ మీరు ఇలానే సంఘీభావం కొనసాగించాలి. బలంగా ఉండాలి. మరో 21 రోజులు హోటల్ లోనే ఉండాల్సిరావచ్చు. మెజారిటీ మన దగ్గరే ఉంది’’ అని గెహ్లాట్ చెప్పారు.

అర్ధరాత్రి దాకా కేబినెట్ మీటింగ్
మరోవైపు శుక్రవారం రాజ్ భవన్ లో ధర్నా తర్వాత.. అర్దరాత్రి దాకా కేబినెట్ మీటింగ్ జరిగింది. మరోసారి కేబినెట్‌‌‌‌భేటీ నిర్వహించి అసెంబ్లీసెషన్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తే రాజ్యాంగం ప్రకారం తాను నడుచుకుంటానని ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలకు గవర్నర్‌ ‌‌‌చెప్పారు. దీంతో
ధర్నా విరమించి కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులతో రాత్రివేళ మీటింగ్ నిర్వహించారు. గెహ్లాట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ లో అసెంబ్లీ సమావేశాల అజెండాపై చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, కరోనా వైరస్ వ్యాప్తి , ఆర్థిక సంక్షోభం సహా మొత్తం ఆరు అంశాలపై తీర్మానం రూపొందించారు. ఈ నోట్‌‌‌‌ను శనివారం గవర్నర్‌‌‌‌కు పంపారు.

రాష్ర్ట వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
తమ ప్రభుత్వాన్నికూల్చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ, అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. జైపూర్, జిల్లా కేంద్రాల్లో భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్ వర్కర్లు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ సెషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోటాలో ర్యాలీ చేయగా, జోధ్ పూర్ లో ధర్నా చేశారు.

గవర్నర్‌‌‌‌ను కలిసిన బీజేపీ నేతలు
శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను బీజేపీ నేతలు కలిశారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సతీశ్ పూనియా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ర కటారియా తదితర నేతలు గవర్నర్ తో సమావేశమయ్యారు. రాష్ర్టం లో కరోనా పరిస్థితిపై చర్చించారు. మీటింగ్ తర్వాత సతీశ్ పునియా మాట్లాడుతూ, 8 కోట్ల మంది ప్రజలు రాజ్ భవన్ కు వస్తారని, ఘెరావ్ చేస్తారని సీఎం, హోం మంత్రి హెచ్చరించడం నేరమని అన్నారు.

For More News..

సెక్రటేరియట్ 90 శాతం నేలమట్టం